న్యూఢిల్లీ: ఆర్థిక ప్రపంచీకరణ దిశలో జి20 దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని చైనా కోరింది. ఢిల్లీలో జి20 దేశాల సమావేశాలలో చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఈ దేశ ప్రధాని లి కియాంగ్ ఈ ప్రతిపాదన చేశారు. ప్రపంచ గ్లోబలీకరణ ఆద్యంతం అత్యంత కీలకమైన ప్రకియగా అవుతోందని, దీనికి ఏవో కారణాలు చూపి అడ్డంకులు కల్పించడం అనుచితం అవుతుందని చైనాలో రెండో స్థానంలో ఉన్న నేత కియాంగ్ తెలిపారు. చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ ఈ జి 20 సదస్సుకు హాజరు కాలేదు. చైనా ప్రతినిధి బృందానికి దేశ ప్రధాని సారధ్యం వహించారు. జి20 సదస్సులో విభేదాలు తొలిగిపోవాలి. సమైక్యత కుదరాలి.
ఘర్షణల బదులు సహకారం అవసరం అన్నారు. వెలివేతల బదులు కలగొలుపు తనం కీలకం అని స్పష్టం చేశారు. జి20 సమ్మిట్ తొలి సెషన్‌లో చైనా ప్రధాని మాట్లాడారు. పారిశ్రామిక, ఇతరత్రా సరఫరా వలయాలు దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరుకులు నైపుణ్యం సంచరించేందుకు వీలు కల్పించడం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఇందులో పోటీతత్వాన్ని పరిగణనలోకి తీసుకోరాదు. ఎకనామిక్ గ్లోబలైజేషన్ ఇప్పటి ఎప్పటి సూత్రీకరణ కావాలని పిలుపు నిచ్చారు.