Monday, January 20, 2025

టెస్లా అధిపతి మస్క్ సూచనకు చైనా ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

China praises Tesla chief Musk suggestion

బీజింగ్ : టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఇటీవలే తైవాన్ సమస్యకు కూడా తనదైన శైలిలో పరిష్కారం సూచించారు. ఈ ప్రతిపాదన విని చైనా పొంగిపోగా, తైవాన్ మండిపడింది. మస్క్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా చైనాతైవాన్ వివాద పరిష్కారం గురించి మాట్లాడుతూ నా ప్రతిపాదన ఏంటంటే .. చైనాలో తైవాన్‌ను ఓ ప్రత్యేక పరిపాలన జోన్‌గా చేయాలి.ఇది సహేతుకంగా ఉంటుంది. కాకపోతే ఇది అందర్నీ సంతోష పెట్టకపోవచ్చు అని పేర్కొన్నారు. మస్క్ ప్రతిపాదనకు అమెరికా లోని చైనా రాయబారి క్విన్ గ్వాంగ్ స్పందించారు. మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తైవాన్‌ను ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్నందుకు తైవాన్ జలసంధిలో శాంతికి పిలుపునిచ్చినందుకు మస్క్‌కు ధన్యవాదాలు. వాస్తవానికి ఒక దేశం రెండు వ్యవస్థలన్నవి తైవాన్ ప్రశ్నలను పరిష్కరించేందుకు చైనా ప్రాథమిక విధానాలు అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రతిపాదనలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. స్వాతంత్య్రం అమ్మకానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. వాషింగ్టన్‌లో తైవాన్ అనధికార ప్రతినిధి బి ఖిమ్ హిస్సావో ట్విటర్‌లో స్పందిస్తూ తైవాన్ చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది. కానీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మాత్రం విక్రయానికి లేవు. భవిష్యత్తు కోసం చేసే శాశ్వత ప్రతిపాదనలు శాంతియుతంగా, భయరహితంగా, తైవాన్ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా ఉండాలి అని మస్క్‌కు చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News