Thursday, January 23, 2025

ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్టుపై మోకాలొడ్డిన చైనా

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్ ఖైదా శాంక్షన్ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా దేశాలు గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్టు రుజువు కావడంతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

China puts on hold UN proposal to blacklist 26/11 terrorist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News