Friday, December 20, 2024

అరుణాచల్ ప్రదేశ్ లోని మరో 30 ప్రాంతాలకు చైనా పేర్లు?!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా తన నాలుగో జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ లోని మరి 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మరోమారు పునరుద్ఘాటించింది. ఇండియా ఎన్నిసార్లు వ్యతిరేకించినా పట్టించుకోవడంలేదు. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తమ దక్షిణ టిబెట్ లో భాగం అంటోంది.

చైనా ఇదివరలో 2017లో ఆరు ప్రాంతాలను పేర్కొంటూ మొదటి జాబితాను, తర్వాత 15 ప్రాంతాలను పేర్కొంటూ2021లో  రెండో జాబితా, 11 ప్రాంతాలను పేర్కొంటూ 2023లో మూడో జాబితాను విడుదల చేసింది. ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించినప్పుడు చైనా తన నిరసన తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలు తమవని పేర్కొంటూ పదేపదే చైనా చేస్తున్న వాదనలను విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ‘హాస్యాస్పదం’ అంటూ కొట్టి పారేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News