Saturday, November 16, 2024

మరోసారి వక్రబుద్ధి చాటుకున్న డ్రాగన్

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత దేశంలో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ ప్రాంతం తమ దేశంలో భాగమేనని మరోసారిపేర్కొంది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొంటూ స్టాండర్డ్ మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా నేచురల్ రిసోర్సెస్ రూపొందించిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌న్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. ఇక 1962 వరకు కశ్మీర్‌లో అంతర్భాగమైన అక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించుకుంది. అప్పటినుంచి ఈ భూభాగంపై భారత్, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. డిజిటల్, నేవిగేషన్ మ్యాప్‌లను కూడా విడుదల చేస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఈ మ్యాప్ పొరుగుదేశాలతో తమ సరిహద్దులను డ్రాయింగ్ పద్ధతిద్వారా చూపిస్తుంది. ఇక తైవాన్, దక్షిణ చైనా సముద్రంకూడా చైనాలో అంతర్భాగమేనని నూతన మ్యాప్‌లో పేర్కొంది.దక్షిణ చైనా సముద్రంలో అతిపెద్ద భాగమైన ‘నైన్‌డ్యాష్ లైన్’ను కూడా తమప్రాంతగా డ్రాగన్ దేశం చూపించుకుంది. అయితే దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్‌లు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 1962లో భారత్‌తో జరిగిన యుద్ధంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను అక్రమించుకున్న చైనా ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ పలుసార్లు స్పష్టం చేసింది. అయినా చైనా తన వైఖరిని మార్చుకోవడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News