Monday, January 20, 2025

చైనా భూభాగంగా అరుణాచల్ ప్రదేశ్: తాజా మ్యాప్ విడుదల

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, వివాదాస్పద అక్సయ్ చిన్ ప్రాంతాలను తన భూభాగంలో భాగంగా చైనా ఈ పటంలో చూపించింది.

దక్షిణ టిబెట్‌గా అరుణాచల్ ప్రదేశ్‌ను చూపించిన చైనా 1962 యుద్ధ కాలంలో ఆక్రమించిన అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన భూభాగంగా చూపించింది. కొత్త పటంలో తైవాన్‌తోపాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తన భూభాగంలో చైనా చేర్చుకుంది. దక్షిణ చైనా సముద్రంలోని అత్యధిక భాగాన్ని తన సరిహద్దుల్లో చైనా కలిపేసుకుంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలు తమవేనంటూ వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి.

జెజియాంగ్ ప్రావిన్సులోని డెకింగ్ కౌంటీలో సోమవారం సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే, నేషనల్ మ్యాపింగ్ అవేర్‌నెట్ పబ్లిసిటీ వీక్ వేడుకల సందర్భంగా చైనా సహజ వనరుల మంత్రిత్వశాఖ తాజా దేశ పటాన్ని విడుదల చేసింది. దక్షిణాఫ్రికాలో గత వారం జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News