Sunday, April 13, 2025

ముదురుతున్న సుంకాల సమరం

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం రోజురోజు కు ముదురిపోతున్నది. రెండు దేశాలు పోటాపోటీగా పరస్పరం ప్రతీకార సుంకాలు పెంచుకుంటూ పోతున్నాయి. అయితే అమెరి కా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా ఇతర దేశాలకు ప్రతీకార సుం కాల నుంచి 90రోజుల పాటు మినహాయింపునిచ్చారు. చైనా నుం చి వస్తున్న దిగుమతులపై సుంకాలను మంగళవారం 104 శా తానికి ట్రంప్ పెంచడంతో చైనా భగ్గుమన్నది. అమెరికా వస్తువు లపై సుంకాలను అది 84శాతానికి పెంచింది. ఈ పరిణామంతో కంగుతిన్న అమెరికా చైనా వస్తువులపై సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచి గట్టి షాక్ ఇచ్చింది. యుఎస్‌తో పెరుగుతున్న వా ణిజ్య యుద్ధంలో ‘కడ వరకు పోరాడతాం’అని చైనా శపథం చే సింది.ప్రపంచ వాణిజ్య సంస్థ
వనరులు చైనాకు ఉన్నాయి’ అని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ యుఎస్‌తో వాణిజ్యపై ఒక శ్వేత పత్రం విడుదల చేస్తూ ఒక ప్రకటనలో హెచ్చరించింది. అనేక ఇతర దేశాలు చేస్తున్నట్లుగా వైట్ హౌస్‌తో తాము సంప్రదింపులు జరుపుతామా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

ట్రంప్ ‘విమోచన దినం’ టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా యుఎస్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని సరకులపై 34 శాతం టారిఫ్‌ను, రేర్ ఎర్త్ మినరల్స్‌పై ఎగుమతి నియంత్రణలను, పలు ఇతర చర్యలను శుక్రవారం ప్రకటించింది. ట్రంప్ ఆతరువాత చైనా నుంచి వచ్చే సరకులపై అదనంగా 50 శాతం టారిఫ్‌ను విధించారు. చైనాతో సంప్రదింపులను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. చైనా బుధవారం ప్రకటించిన కొత్త చర్యల్లో సదరు ‘విశ్వసనీయంకాని సంస్థల’ జాబితాలో 11 అమెరికన్ సంస్థలను చేర్చింది. ద్వివినియోగ సరకులను యుఎస్ సంస్థలకు అమ్మకుండా చైనీస్ సంస్థలను ఆ జాబితా నిషేధిస్తుంది. ఆ జాబితాలోని సంస్థల్లో అమెరికన్ ఫోటోనిక్స్, సైనెక్సస్ ఉన్నాయి. ఆ రెండూ అమెరికన్ మిలిటరీతో కలసి పని చేస్తుంటాయి. యుఎస్‌తో సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా ఇంత వరకు కనిపించలేదు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యల పరిష్కారాన్ని యుఎస్ నిజంగా వాంఛిస్తున్నట్లయితే అది సమానత్వం, గౌరవం, పరస్పర ప్రయోజనం విధానాన్ని అనుసరించాలి’ అని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ బుధవారం సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News