Friday, December 20, 2024

చైనాలో మళ్లీ కరోనా మరణాలు!

- Advertisement -
- Advertisement -

2 omicron deaths in China
బీజింగ్: చైనాలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా ఏడాది తర్వాత అక్కడ రెండు కరోనా మరణాలు చోటుచేసుకున్నాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు తెలిపారు. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ విజృంభిస్తోంది. శనివారం నాటికి అక్కడ 4,051 కొత్త కేసులు నమోదయ్యాయి. 2021 తర్వాత చైనాలో మళ్లీ కరోనా వైరస్ మరణాలు చోటుచేసుకోవడం ఇప్పుడే. ఈశాన్యంలోని జిలిన్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ చనిపోయారు. ఇదిలావుండగా చైనాలో ‘జీరో కొవిడ్’ విధానానికి స్వస్తి పలకాలని చైనా భావిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశం ఖండించింది. జీరో కొవిడ్ విధానం వల్ల ప్రజల జీవితం, వృత్తి వంటి అంశాలపై ప్రభావం పడినా వారి ఆరోగ్య, భద్రతను కాపాడటానికి ఆ విధానాన్ని కొనసాగిస్తామని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఉపమంత్రి వాంగ్ హెషెంగ్ తెలిపారు. ఇదిలావుండగా హాంకాంగ్‌లో కూడా కొత్త కేసులు విజృంభించాయి. రెస్టారెంట్లు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఇక చైనాలో దక్షిణాది టెక్ హబ్ ఉన్న షెన్‌ఝెన్‌లో 1కోటి 75 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఆ నగరాన్ని కూడా మూసేశారు. ‘స్టేఎట్‌హోమ్’ ఉత్తర్వుల కారణంగా లక్షలాది మంది ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌లను కొనసాగించాలని చైనా నిర్ణయించింది. కొవిడ్ పరీక్షలు, క్వారంటైన్‌లు అమలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News