బీజింగ్: బర్డ్ ఫ్లూ కొత్త స్ట్రెయిన్ హెచ్10ఎన్3 ఎంట్రీ తొలిసారి మనిషిలో వెలుగుచూసింది. అదికూడా చైనాలోనే వెలుగుచూడడం అందరి దృష్టిని ఆకర్షించింది. చైనా తూర్పు ప్రావిన్స్ ఝెన్ జియాంగ్ నగరానికి చెందిన 41ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్ 28న ఈ స్ట్రెయిన్ బయటపడిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) మంగళవారం తెలిపింది. అయితే ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే దానిపై వివరాలు ఇవ్వలేదు. హెచ్10ఎన్3 వైరస్ రోగకారక ప్రబుద్ది తక్కువగా ఉంటుందని, తక్కువ తీవ్రత ఉంటుందన్నారు. కోళ్ళ ఫారల్లో కనిపించే ఈ స్ట్రైయిన్ తక్కువగానే విస్తరిస్తుందని అధికారులు తెలిపారు. దీంతో అతనికి నెలరోజుల పాటు చికిత్స అందించి 28 నుంచి ఆస్పత్రి డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగుందని తెలిపారు. 2016-2017లో హెచ్7ఎన్9 జాతి 300 మంది మరణించారు. హెచ్10ఎన్3 తో మానవ సంక్రమణకు సంబంధించిన ఇతర కేసులు ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నివేదించబడలేదని ఎన్ హెచ్ సి వెల్లడించింది.
China Reports First Human Case Of H10N3 Bird Flu