- Advertisement -
బీజింగ్: చైనాలో ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ రాకెట్ గాలిలో ఎగిరిన 30 సెకన్లలోనే పేలిపోయింది. కంప్యూటర్ లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. సెంట్రల్ చైనాలోని పెనాన్ ప్రావిన్స్లో ఆదివారం చైనీస్ టియాన్ లాంగ్ -3 రాకెట్ ప్రయోగం చేపట్టారు. అయితే ఇది టెస్ట రన్ లోనే విఫలమయింది. ఇది చైనాలోని ఎక్స్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన రాకెట్. పేలుడు కారణంగా ఎవరూ గాయపడలేదని చైనా మీడియా, స్పేస్ పయనీర్ వెల్లడించాయి. రాకెట్ ప్రయోగించిన 30 సెకన్లలోనే పల్టీలు కొట్టుకుంటూ ప్రయోగ కేంద్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని అడవిలో కూలిపోయింది. కూలిన సమయంలో భారీ పేలుడు సంభవించింది.
- Advertisement -