Monday, November 18, 2024

దలైలామా వారసుడెవరైనా దేశంలోని వారే అయి ఉండాలి

- Advertisement -
- Advertisement -

బీజింగ్: దలైలామాకు వారసుడెవరైనా దేశంలోపలినుంచే ఉండాలని, ఆయన వారసుడికి ప్రభుత్వ ఆమోదం ఉండి తీరాలని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యూహాత్మకంగా ఎంతో కీకమైన టిబెట్‌ను దక్షిణాసియాకు గేట్‌వేగా అభివర్ణించిన డ్రాగన్ భారత్ సరిహద్దులకు ఆనుకయుని ఉన్న ఈ ప్రాంతంలోచేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధానంగా పేర్కొంది. ‘దలైలామాలు, పంచెన్ రిన్‌పోంచ్‌లు సహా టిబెట్‌లో నివసించే పునర్జన్మ పొందిన బౌద్ధులెవరైనా సరే దేశంలోని వారే అయి ఉండాలి. అంతేకాకుండాచనిపోయిన వారి అస్థికలతో కూడిన కలశంనుంచి లాటరీ ద్వారా నిర్ణయించబడిన, కేంద్ర ప్రభుత్వంనుంచి ఆమోదం పొందిన వారయి ఉండాలి’ అని చైనా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొంది.

భారత్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో నివసిస్తున్న 88 ఏళ్ల దలైలామా తన వారసుడిని తానే ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రయత్నాలను కూడా మ్మురం చేశారు. అయితే దలైలామా టిబెట్‌లోని బౌద్ధులకు గురువుగా ఉండడం చైనా ప్రభుత్వానికి సుతరామా ఇష్ట లేదు. అందుకే దలైలామా తన వారసుడిగా ఎంపిక చేసిన బాలుడిని తొలగించి అతని స్థానంలో పంచన్ లామాను దలైలామాకు తదుపరి వారసుడిగా నియమించింది. అయితే పంచన్‌లామాకు టిబెట్‌లో పెద్దగా పలుకుబడి లేదు.అందువల్ల చైనాకు చెందిన వ్యక్తే దలైలామాకు వారసుడిగా ఉండాలని ప్రభుత్వం ఎంతగా చ్పెన్నపటికీ అది అంత సులవు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News