Sunday, January 12, 2025

మాంద్యం వేళ చైనా జిడిపి అంచనా 5%

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగాన్ని తగ్గించేందుకు 1.2 కోట్ల ఉద్యోగాల హామీ

బీజింగ్ : చైనాలో మాంద్యం భయాలు పెరుగుతున్న నేపథ్యంలో 2024 సంవత్సరానికి జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనా 5 శాతంగా ఆ దేశం ప్రకటించింది. గత దశాబ్దంలో ఇంత తక్కువ జిడిపి అంచనా ఇదే. నిరుద్యోగం పెరుగుతున్న వేళలో 1.2 కోట్ల ఉద్యోగాల హామీతో 5 శాతం జిడిపి అంచనాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చైనాలో 5.5 శాతం నిరుద్యోగ రేటు ఉంది. రబ్బర్ స్టాంప్ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి) ప్రారంభం సెషన్‌లో చైనా ప్రధాని లి క్వాంగ్ జిడిపి గణాంకాలను అధికారింగా విడుదల చేశారు. జిడిపిలో లోటు నిష్పత్తి 3 శాతం, 2023 బడ్జెట్ నుంచి 180 బిలియన్ యువాన్లు (26 బిలియన్ డాలర్లు) ప్రభుత్వం లోటు పెరిగిందని నివేదిక తెలిపింది.

చైనా రక్షణ బడ్జెట్ 7.2 శాతం పెంపు
చైనా తన రక్షణ బడ్జెట్‌కు మరోసారి అధిక ప్రాధాన్యతనిచ్చింది. రక్షణ బడ్జెట్‌ను 232 బిలియన్ డాలర్లకు 7.2 శాతం పెంచింది. తైవాన్‌లో ఉద్రిక్తత, భారత్‌తో సరిహద్దు వివాదాలు, అమెరికాతో విరోధం వల్ల రక్షణ వ్యవస్థకు చైనా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్టు పేర్కొంది. అమెరికా రక్షణ బడ్జెట్‌కు 886 బిలియన్ డాలర్ల కేటాయించింది. అమెరికా తర్వాత రక్షణ వ్యవస్థకు అత్యధికంగా కేటాయింపులు చేసిన రెండో దేశంగా చైనా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News