బీజింగ్ : షాంఘైలో కొవిడ్ బాధితులు మరో 8 మంది మృతి చెందారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25 కు చేరింది. ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు 19,300 కేసులు కొత్తగా నమోదయ్యాయి. బుధవారం నమోదైన 19,382 కేసుల్లో 2830 కేసులు పాజిటివ్ కాగా, మిగతా కేసులు అసింప్టొమేటిక్ కేసులని , వీటిలో ఎక్కువ కేసులు షాంఘైకు చెందినవని అధికారులు తెలిపారు. పాజిటివ్, అసింప్టొమేటిక్ కేసులన్నీ నియమించిన ఆస్పత్రుల్లోనే చికిత్స చేయించవలసి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. షాంఘై కాకుండా మిగతా 17 ప్రావిన్సియల్ రీజియన్లలో కేసులు పెరుగుతున్నాయి. ఈశాన్యప్రావిన్స్ జిలిన్‌లో 95,బీజింగ్‌లో 1 కేసులు నమోదయ్యాయి. బుధవారం నిర్ధారణ అయిన 31,421 కేసులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. షాంఘైలో కేసులు, మరణాలు పెరగడానికి వయోవృద్ధులకు సరిగ్గా టీకాలు అందక పోవడమేనని చెబుతున్నారు.
షాంఘైలో కొవిడ్ బాధితులు మరో 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -