బీజింగ్: జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌తో షెంజౌ-16 సిబ్బంది బయలుదేరారు.
చైనా మంగళవారం తన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చంద్రునిపైకి సిబ్బందితో కూడిన మిషన్‌ను పంపే ప్రణాళికలను అనుసరిస్తున్నందున మొదటిసారిగా ఒక పౌరుడిని కక్షలోకి ప్రవేశపెట్టింది.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి సైనం నడిపిస్తున్న అంతరిక్ష కార్యక్రమంతో పోటీపడుతోంది. అమెరికా, రష్యాతో సమానంగా పోటీ పడాలనుకుంటోంది.
వాయువ్య చైనాలోని జియక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 9.31 గంటలకు లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్‌తో షెన్‌జౌ-16 సిబ్బంది బయలుదేరారు. దీనిని ఎఎఫ్‌పి జర్నలిస్టులూ చూశారు. ‘ప్రయోగం పూర్తిగా విజయవంతం అయింది. వ్యోమగాములు మంచి స్థితిలో ఉన్నారు’ అని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ డైరెక్టర్ జూ లిపెంగ్ తెలిపారు. రాకెట్ నింగిలోకి పోతున్నప్పుడు ప్రేక్షకులు ‘వావ్’ అని బిగ్గరగా కేకలు పెట్టారు. ‘గుడ్ లక్’ అని కూడా విష్ చేశారు. చైనా ‘అంతరిక్ష స్వప్నం’ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ది. చంద్రుడిపై స్థావరం నిర్మాణ ప్రణాళిక కూడా చైనాకు ఉంది.
2011 నుంచి చైనాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వేరుగా ఉంచారు. ‘నాసా’లో చైనాను నిమగ్నం కానివ్వకుండా అమెరికా నిషేధించింది. దాంతో చైనా స్వంతగా ఆర్బిటల్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసుకోడానికి నెట్టివేయబడింది. కాగా చైనా అంతర్జాతీయ సహకారాన్ని ఆశిస్తున్నట్లు సోమవారం పునరుద్ఘాటించింది. ప్రతి సంవత్సరం ఇద్దరు సిబ్బందితో అంతరిక్ష యాత్రలను చేపట్టాలని చైనా యోచిస్తోందని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ(సిఎంఎస్‌ఎ) తెలిపింది. చైనా తదుపరి షెన్‌జౌ17ను అక్టోబర్‌లో ప్రయోగించనున్నది.