- Advertisement -
బీజింగ్ : పాకిస్థాన్ సైన్యానికి చైనా మిలిటరీ ఆదివారం కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది. అయితే ఎన్ని డోసులు పంపిందో వివరించలేదు. బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ 5,00,000 డోసుల వ్యాక్సిన్ అందుకున్న కొన్ని రోజుల తరువాత ఈ సరఫరా జరిగింది. చైనా మిలిటరీ నుంచి వ్యాక్సిన్ అందుకున్న మొదటి విదేశీ సైన్యం పాక్ మిలిటరీయేనని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ప్రకటించింది. కాంబోడియా మిలిటరీకి కూడా అభ్యర్థనపై చైనా పిఎల్‌ఎ కరోనా వ్యాక్సిన్లను పంపించింది. పాకిస్థాన్‌లో కరోనా కేసులు 5,54,474 కు చేరుకోవడం, కొత్తగా 53 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 11,967 వరకు పెరగడంతో వ్యాక్సిన్లను అదనంగా రప్పించుకోవలసి వస్తుందని జాతీయ వైద్యసేవల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
- Advertisement -