Wednesday, January 22, 2025

లష్కరే ఉగ్రవాది షాహిద్ మహమూద్‌కు చైనా అండ

- Advertisement -
- Advertisement -

China supports Lashkar terrorist Shahid Mahmood

న్యూయార్క్ : లష్కరే తొయిబా కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్యసమితి లో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్ , అమెరికా దేశాలు ఐరాస లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది. ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐరాసలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. ఐరాస భద్రతా మండలిలో ‘1267 అల్‌ఖైదా అంక్షల కమిటీ ’ కింద మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికా ఈ ప్రతిపాదనలు చేశాయి. 2016 లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ షాహిద్ మహమూద్, సార్వార్‌పై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూరుస్తున్నట్టు నాటి అమెరికా ఫారెన్ అసెట్ కంట్రోల్ అధికారి జాన్ ఇ స్మిత్ పేర్కొన్నారు.

ఎవరీ షాహిద్ మహమూద్ ?
షాహిద్ మహమూద్ కరాచీలో లష్కరే తొయిబా సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా పనిచేశాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)లో కొనసాగి, 201516 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News