- Advertisement -
న్యూఢిల్లీ: ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు మిరామ్ టారోర్‌ను విడుదల చేసేందుకు చైనా ఎట్టకేలకు ఒప్పుకుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఎప్పుడు ఆ పిల్లాడిని అప్పగిస్తారనేది తేదీ, సమయం త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఇండియన్ ఆర్మీ మాట్లాడుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా సానుకూలంగా స్పందించి తమ వద్ద ఉన్న యువకుడిని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఎక్కడ అప్పగించాలో కూడా స్థలాన్ని సూచించిందని, అయితే దీనికి సంబంధించి త్వరలో తేదీ, సమయం త్వరలోనే తెలియజేస్తారని అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగిందని కిరణ్ రిజుజు అన్నారు.
- Advertisement -