బీజింగ్: వచ్చే వారం ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌కు చైనా 400 మందికి పైగా అథ్లెట్స్‌ను పంపిస్తుందని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా బుధవారం తెలిపింది. మొత్త 737 మంది సభ్యుల బృందంలో 431 మంది అథ్లెట్లు ఉంటారని, చైనా వెలుపల జరిగే ఒటింపిక్స్‌కు పంపుతున్న అతిపెద్ద బృందం ఇదేనని ఆ వార్తాసంస్థ తెలిపింది. ఈ బృందంలో 298 మంది అథ్లెట్లు ఉంటారు. పురుష అథ్లెట్లు 133 మందితో పోలిస్తే వీరి సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువ కావడం గమనార్హం. 14 ఏళ్ల మహిళా స్విమ్మర్ క్వువాన్ హోంగ్‌చాన్ మొదలుకొని 52 ఏళ్ల ఈక్వెస్ట్రియన్ లిఝెన్‌క్వియాంగ్ దాకా అన్ని వయసుల వారు ఈ బృందంలో ఉన్నారని జిన్హువా తెలిపింది. బయటి దేశాల ఒలింపిక్స్‌కు చైనా పంపిస్తున్న అతిపెద్ద బృందం ఇదేనని కూడాఆ వార్తాసంస్థ తెలిపింది. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌కు చైనా బృందంలో 1099 మంది సభ్యులుండగా, వారిలో అథ్లెట్లు 639 మంది ఉన్నారు. టేబుల్‌టెన్నిస్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, వెయిట్‌లిఫ్టింగ్, షూటింగ్, డైవింగ్ విభాగాల్లో చైనా పతకాలు సాధించే అవకాశం ఉంది. కాగా కరోనా కారణంగా ఏడాదికి పైగా ఆలస్యం అయిన టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
China to send 400 Athletes to Tokyo Olympics