Sunday, December 22, 2024

శ్రీనగర్‌లో జి20 సమావేశానికి చైనా, సౌదీ అరేబియా,టర్కీ డుమ్మా!

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: చైనా, టర్కీ, సౌదీ అరేబియా కశ్మీర్‌లో జరుగుతున్న మూడో జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో పాల్గొనకుండా అధికారికంగా వైదొలిగాయి. ఈజిప్టు కూడా ఈ దేశాలతో డుమ్మా కొట్టింది. 17 దేశాల నుంచి 120 మంది విదేశీ ప్రతినిధులు సోమవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు, అయితే టర్కీ, సౌదీ నుంచి కొంతమంది ప్రైవేట్ టూరిజం ప్రతినిధులు చేరినప్పటికీ చైనా నుంచి ఏ ప్రతినిధి రాలేదు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను ఉటంకిస్తూ పిటిఐ నివేదిక ఇలా పేర్కొంది: ‘వివాదాస్పద భూభాగంలో ఎలాంటి జి20 సమావేశాలను నిర్వహించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది…మేము అలాంటి సమావేశాలకు హాజరుకాము’. కశ్మీర్‌లో జి20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించడాన్ని వ్యతిరేకించిన చైనాకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. దాని స్వంత భూభాగంలో సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ దానికుందని పేర్కొంది.

మూడు రోజుల ఈ సమావేశానికి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికా, యూకె, యూఎస్, యూరోపియన్ యూనియన్‌లు పాల్గొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News