Saturday, November 23, 2024

పాకిస్థాన్‌కు నిత్యం చైనా అండదండలు : బీజింగ్

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి ) ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఈ వెంచర్ ఉభయ దేశాల మధ్య పెనవేసుకున్న గాఢమైన స్నేహానికి ప్రతీక అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. చైనా ఎల్లప్పుడూ పాకిస్థాన్‌కు అండగా దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. సిపిఇసి ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టులు చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పదో వార్షికోత్సవాన్ని ఇస్లామాబాద్‌లో సోమవారం నిర్వహించిన సందర్భంగా జిన్‌పింగ్ అభినందన సందేశాన్ని అందజేశారు.

60 బిలియన్ డాలర్ల విలువ చేసే సిపిఇసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ … బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ బెలోచిస్థాన్ లోని గ్వాడర్ పోర్టుతో చైనా లోని జింజియాంగ్ ప్రావిన్స్‌తో అనుసంధానం అయ్యే సిపిఇసి ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఈ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి చైనా వైస్ ప్రీమియర్ హెలిఫెంగ్ హాజరయ్యారు. ఆయన పాకిస్థాన్‌లో మూడు రోజుల పర్యటనకు విచ్చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News