- Advertisement -
పరిశోధనలకు లక్ష లంక కోతుల బేరం
కొలంబో : పలు రకాల పరిశోధనలకు చైనా శ్రీలంక నుంచి ఒక లక్ష అంతరించిపోతున్న కోతులను కొనుగోలు చేస్తోంది. తమ దేశం నుంచి చైనా వానరాలను తెప్పించుకుంటోందని శ్రీలంక అధికారికంగా గురువారం ధృవీకరించింది. వైరస్‌లతో జంతువుల్లో , జంతువులతో వైరస్‌లపై చైనా తరచూ ప్రయోగాలకు దిగుతోంది. పర్యావరణ సంస్థలు, జంతుప్రేమికులు ఎంతగా వారిస్తూ వస్తూన్నా వినకుండా చైనా తన జంతు ప్రయోగాలను సాగిస్తోంది. ఈ క్రమంలో బాగా అంతరించిపోతున్న కోతులపై శ్రీలంక తన ప్రయోగాలను వేగవంతం చేయడం ప్రపంచవ్యాప్తంగా పలు రకాల ఆలోచనలకు దారితీసింది.
- Advertisement -