Thursday, January 23, 2025

తైవాన్‌పై బలప్రయోగానికి వెనుకాడం: జిన్‌పింగ్

- Advertisement -
- Advertisement -

Xi Jinping

బీజింగ్: తైవాన్ విషయంలో అమెరికా తీరుపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మండిపడ్డారు. తైవాన్‌ను చైనా భూభాగంలో కలపడానికి బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ(సిపిసి) 20వ జాతీయ మహాసభలో ప్రారంభోపన్యాసం చేసిన ఆయన గత పదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని వివరించారు. హాంకాంగ్‌పై ఇప్పటికే ఆధిపత్యం సాధించామన్నారు.

వారం రోజుపాటు సాగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహా సభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను మూడోసారి సిపిసి ఎన్నుకుంది. జిన్‌పింగ్ మినహా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌తో పాటు సీనియర్ నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తారు. ఆ స్థానాల్లో కొత్తవారు రానున్నారు. ఇదిలావుండగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయనే జీవితాంతం ఆ పదవిలో ఉండే అవకాశం కనబడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News