Monday, December 23, 2024

తహసీల్దార్ రమణయ్య దారుణహత్య

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం కొమ్మాదిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ రమణయ్య దారుణహత్యకు గురయ్యాడు. చరణ్ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి దాడి చేశారు. వాచ్‌మెన్‌ కేకలు వేయడంతో నలుగురు దుండగులు పారిపోయారు. తీవ్రగాయాలతో పడిఉన్న రమణయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందాడు. రమణయ్య విశాఖపట్నం రూరల్ తహసీల్దార్‌గా పనిచేశారు. ఇటీవల ఆయన విజయనగరం జిల్లా బంటుమిల్లికి బదిలీ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుల పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News