Monday, January 20, 2025

అమెరికాలో అక్రమసంబంధం.. సంతానం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను పార్టీ పదవినుంచి బర్తరఫ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఎవరికి కన్పించకుండా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన అమెరికాలో చైనా రాయబారిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమ సంబంధం, అక్కడ తండ్రి వ్యవహారంపై చైనా జరిపిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఆయనపై వేటు వేశారు. అక్కడ తమ పదవీ కాలంలో ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, ఈ విధంగా ఓ బాబు కూడా పుట్టాడని వెల్లడైంది. డా కల్గింద దేశాంగ మంత్రి క ఖలీస్థానీ ప్రాబల్య వాదం భారత్ కెనడాల మధ్య రాజీకి వీలులేని చిచ్చుకు దారితీసింది.

చైనాలో దేశ రాయబారిగా ఉన్నప్పుడు కిన్ నెరిపిన వ్యవహారాన్ని చైనా అధికార వర్గాలు తీవ్రంగా తీసుకుని చర్య తీసుకున్నాయి. సంబంధిత విషయంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ విశేష వార్తా కథనాన్ని వెలువరించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఉన్నత స్థాయి దర్యాప్తు వ్యవహారంపై దర్యాప్తు జరిగినట్లు వెల్లడైంది. దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న అమెరికాలో రాయబారి దశలో ఉన్నప్పుడు తండ్రి కావడం దేశ భద్రతా వ్యవహారాల ఉల్లంఘన పరిధిలోకి రాకుండా ఉంటుందా? అనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. చైనా ఆయనను పదవి నుంచి జులైలోనే తొలిగించినట్లు అమెరికా పత్రికలు పేర్కొన్నాయి.

కన్పించకుండా పోయిన రక్షణ మంత్రి లి షాంగ్ఫూ
చైనాలో కీలక స్థాయిలో ఉంటూ వచ్చిన రక్షణ మంత్రి జనరల్ లి షాంగ్ఫూ కన్పించడం లేదు. ఆయన ఆగస్టు 29న చివరి సారి ప్రజల ముందుకు వచ్చారు. అప్పుడు బీజింగ్‌లో జరిగిన చైనా ఆఫ్రికా భద్రతా ఫోరం వేదిక నుంచి ఆయన ప్రసంగించారు. ఆ తరువాత ఆయన ఉన్నట్లుడి ఎక్కడికి వెళ్లారనేది మిస్టరీగా మారింది.ఆయన సెప్టెంబర్ తొలివారంలో ఓ అంతర్జాతీయ స్థాయి సదస్సులో చైనా తరఫున హాజరుకావల్సి ఉంది. కానీ దీనికి ఆయన వెళ్లలేదు. అనారోగ్య కారణాలతో ఆయన రావడం లేదని చైనా అధికారికంగా ప్రకటించింది.

అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నందున దర్యాప్తు చేపట్టారని వార్తలు వెలువడ్డాయి. దీనిని చైనా అధికారికంగా ధృవీకరించలేదు. ఆ తరువాత ఈ మంత్రి కన్పించకుండా పోవడం సంచలనం అయింది. అప్పటికే అంతకు ముందు విదేశాంగ మంత్రి అయిన కిన్ గాంగ్ కూడా జాడలేకుండా పొయ్యారు. అంతకు ముందు ఆయన జూన్ 25వ తేదీన పబ్లిక్‌లో కన్పించారు. తరువాత ఆయనను కారణం తెలియచేయకుండానే పదవి నుంచి తీసేశారు. ఆయన స్థానంలో వాంగ్ యీని నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News