బీజింగ్ : అంతరిక్షంలో తొలిసౌర విద్యుత్ ప్లాంట్‌ను చైనా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రాథమిక దశలో ఉండగా, నిర్దేశిత లక్షం కంటే రెండేళ్లు ముందుగానే 2028 నాటికి దీన్ని ఆవిష్కరించడానికి చైనా ముందుకెళ్లోంది. సౌర ఇంధనాన్ని విద్యుత్, మైక్రోవేవ్‌లుగా మార్చే ఉద్దేశంతో సోలార్ స్పేస్ స్టేషన్‌కు చైనా ప్రణాళికలు రూపొందిస్తోంది. కక్షలో ఉపగ్రహాలు తిరిగే శక్తిని అందించేందుకు వీటిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తోంది. వైర్‌లెస్ ఇంధన తరలింపు వ్యవస్థ ద్వారా ఎనర్జీ బీమ్‌లను భూమికి మళ్లించనుంది. ప్రతిపాదిత సోలార్ స్టేషన్ సౌర ఇంధనాన్ని భూమికి తరలించే సామర్ధం కలిగి ఉంటుంది. ఈ దిశగా చైనా ప్రాథమిక దశల్లో విజయవంతంగా ప్రయోగాలను చేపట్టింది. జిడియన్ యూనివర్శిటీ విద్యార్థులు, పరిశోధకులు ఈమేరకు అధ్యయనం చేపట్టారు. ఈ పవర్‌ప్లాంట్ 10 కిలోవాట్ల సామర్ధం కలిగి ఉంటుంది. ఇలాంటి పవర్‌ప్లాంట్‌ను జిడియన్ విద్యార్థులు , పరిశోధకులు ఇదివరకు ఏర్పాటు చేశారు. వీరు ఏర్పాటు చేసిన 75 మీటర్ల ఎత్తయిన నిర్మాణంలో సౌర శక్తి శ్రేణులను చూసే ఐదు ఉపవ్యవస్థలు ఉంటాయి. అంతరిక్షం నుంచి సౌర శక్తిని ఉత్పత్తి చేసే ప్రణాళిక 2014లో రూపొందింది.