Friday, December 20, 2024

60 ఏళ్లలో తొలిసారి తగ్గిన చైనా జనాభా !

- Advertisement -
- Advertisement -

 

 

China Population Decrease

బీజింగ్: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా దేశంలో 60 ఏళ్లలో తొలిసారి జనాభా తగ్గింది.1959-61తో పోల్చుకున్నప్పుడు తొలిసారి ఈ సంవత్సరం చైనా జనాభా తగ్గింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ ఈ వివరాలను వెల్లడించింది. చైనాలో 2021లో జనాభా పెరుగుదల 1.41212 బిలియన్ నుండి కేవలం 1.41260 బిలియన్లకు మాత్రమే పెరిగింది. దశాబ్డానికి పూర్వం సంవత్సరానికి ఎనిమిది మిలియన్ల పెరుగుదల ఉండే చైనా జనాభా అతి తక్కువగా 4,80,000 మాత్రమే పెరిగింది. కొవిడ్-19 ఆంక్షలు కూడా జనాభా పెరుగుదలకు అడ్డంకి అయింది. 1980 దశకం చివరలో ఫెర్టిలిటీ రేటు 2.6 ఉండింది. ఇది మరణాల రేటు కన్నా 2.1 శాతం ఎక్కువగా ఉండింది. 1991లో సంతానోత్పత్తి  రేటు 1.7 నుంచి 1.6కు, 2020లో 1.3, 2021లో 1.5కు పడిపోయింది. ప్రభుత్వం ఎంత ప్రోత్సాహిస్తున్నప్పటికీ అక్కడి మహిళలు పిల్లల్ని కనేందుకు ఎక్కువగా మొగ్గు చూపడంలేదన్న వాదన కూడా ఉంది. ఆస్ర్టేలియా, అమెరికాలో సంతానోత్పత్తి రేటు చైనా కంటే మెరుగ్గా 1.6 ఉంది. చైనా 1980 నుంచి ఒక కుటుంబానికి ఒకే బిడ్డ పాలసీని అనుసరించింది. కాగా ఇప్పుడ సంతానాన్ని కనేందుకు ప్రోత్సహకాలు ఇచ్చినా అక్కడి మహిళలు ఎక్కువ మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. చైనా జనాభా తగ్గుదల దాని ఆర్థికవ్యవస్థ మీద తప్పక ప్రభావం చూపగలదని మేధావులు భావిస్తున్నారు.ఇదిలావుండగా  చైనాలో 65 ఏళ్ళు దాటిన వృద్ధుల సంఖ్య పెరుగుతూ పోనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News