- Advertisement -
న్యూఢిల్లీ : చైనాలో టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలు బీజింగ్ ప్రభుత్వ కఠిన ఆర్థిక నిబంధనలను చేరుకోలేకపోతున్నాయి. 30 చైనా ప్రాపర్టీ సంస్థల్లో మూడింట రెండొంతులు కష్టాల్లో ఉన్నాయి. చైనా రియల్ ఎస్టేట్ ఇన్ఫో కార్ప్ వివరాల ప్రకారం 20 కంపెనీలు మూడు రెడ్ లైన్లను దాటాయని ఈమేరకు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. డెవలపర్లపై రుణాలకు సంబంధించి కఠిన ఆంక్షలు ఉన్నాయి. దీంతో రియల్టీ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. చైనాలో ఎవర్‌గ్రాండ్ గ్రూప్ ద్రవ్యలభ్యత సంక్షోభాన్ని ఎదుర్కోగా, దీంతో మార్కెట్లపైనా ప్రభావం కనిపించింది.
- Advertisement -