- Advertisement -
షాంఘై: చైనా దేశంలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో 3,500 కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో లాక్‌డౌన్ విధించారు. షాంఘైలో ఆదివారం ఒక్క రోజే 3,500 కొవిడ్19 కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేని కరోనా కేసులే! చైనాలో ఈ నెల దేశవ్యాప్తంగా 56,000కు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో సోమవారం ఉదయం నుంచే కరోనా పరీక్షలు ముమ్మరం చేశారు. 26 మిలియన్‌ల జనాభా ఉన్న షాంఘై నగరంలో లాక్‌డౌన్ ప్రారంభమైంది.
- Advertisement -