బీజింగ్: చైనాలో ప్రతి ఏడాది నవంబర్ 11న సింగిల్స్ డే జరుపుకొంటారు. దీన్ని ‘బ్యాచిలర్స్ డే’ అని కూడా అంటారు. ఈ తేదీని అంకెల్లో పేర్కొంటే 11/11 అవుతుంది. అందులో 1ని ఒక్కో వ్యక్తిగా పరిగణిస్తారు. అంటే తోడునీడలేని నలుగురని భావిస్తారు. చైనాలో బ్రహ్మచారులు వేడుకచేసుకునే ప్రత్యేక ఈవెంట్‌నే ‘సింగిల్స్ డే’ గా అభివర్ణిస్తుంటారు. నంజింగ్ విశ్వవిద్యాలయంలోని నలుగురు యువకులు ఈ సింగిల్స్ డే వేడుకను 1990లో చైనాలో ప్రారంభించారు. ఆ తర్వాత ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాకింది. ఇప్పుడదో తంతుగా మారిపోయింది. 2009లో సింగిల్స్ డే షాఫింగ్ ఫెస్టివెల్‌ను ఆరంభించారు. ఈ షాపింగ్ ఈవెంట్ 11 రోజులపాటు అక్కడ జరుగుతుంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ఇస్తుంటారు. కాగా ఈ సారి సింగిల్స్ డే షాపింగ్ ఫెస్టివల్‌లో దాదాపు రూ. 6.29 లక్షల కోట్లు విలువచేసే ఆర్డర్లు అందాయట. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈసారి 14 శాతం వృద్ధి నమోదయిందంటున్నారు. చైనాలో అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థ అలీబాబా ఈసారి ఈ షాపింగ్ సీజన్‌లో 139 బిలియన్ డాలర్ల అమ్మకాలు చేసి రికార్డు సృష్టించిందని సమాచారం.
చైనాలో ‘సింగిల్స్ డే’ షాపింగ్ అదుర్స్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -