- Advertisement -
బీజింగ్: చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేయగా, దానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీటుగా సమాధానం ఇచ్చారు. టారిఫ్, టెక్ యుద్ధాల్లో విజేతలు ఉండరని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటామన్నారు.
‘‘టారిఫ్ వార్, ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్ అనేవి చారిత్రక పోకడలకు, ఆర్థిక చట్టాలకు విరుద్ధంగా నడుస్తాయి. వీటిలో విజేతలు ఉందరు ’’ అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ) వంటి 10 అంతర్జాతీయ సంస్థల అదినేతలతో భేటీ అయిన సందర్భంగా జిన్ పింగ్ పై విధంగా తెలిపారు. అధికారంలోకి వస్తే చైనా వస్తువులపై 60 శాతం సుంకాలు విధిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
- Advertisement -