Thursday, January 23, 2025

గాలిలో విన్యాసాలు: పట్టుతప్పి అక్రోబాట్ ఆర్టిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: ఒక అక్రోబాట్ ఆర్టిస్టు గాలిలో విన్యాసాలు చేస్తుండగా భర్త పట్టుకోల్పోవడంతో ఆమె స్టేజ్ మీద పడి మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చైనాలోని అన్హుయి ప్రావిన్సులో ఈ ఘోర సంఘటన జరిగింది. హనోగో పట్టణంలో వందలాది మంది ప్రేక్షకుల ఎదుట అక్రబాటిక్ పర్షార్మెన్స్ ఇస్తున్న ఒక 37 ఏళ్ల మహిళాకళాకారిణి ప్రమాదవశాత్తు స్టేజ్ మీద పడి మరణించింది. గాలిలో ఆమెతోపాటే విన్యాసలు చేస్తున్న ఆమె భర్త, సహ కళాకారుడు తన కాళ్లతో ఆమె చేతులను పట్టుకోవలసి ఉండగా అతను పట్టుకోలేక విడిచేయడంతో ఆమె స్టేజ్‌పైన పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలు తగిలాయి. ఈ హఠాత్పరిణామంలో ప్రేక్షకులు షాకయ్యారు. ఆమె మరణించినట్లు కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించడంతో అక్కడ విషాదవాతావరణం నెలకొంది.

Also Read: హిట్‌తో మొదలుపెట్టి.. ఫ్లాప్‌తో కనుమరుగైన దర్శకులు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News