Sunday, December 22, 2024

అరుణాచల్ యువకుడిని అప్పగించిన చైనా సైన్యం

- Advertisement -
- Advertisement -
Chinese army handed over the Arunachal youth
ట్విట్టర్‌లో తెలిపిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు

న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్‌ను చైనా ఆర్మీ అపహరించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పెద్ద దుమారం చెలరేగడంతో చైనా బలగాలతో హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు భారత సైన్యంతెలిపింది. ఈ క్రమంలోనే ఆ యువకుడి ఆచూకీ కనుగొన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ( పిఎల్‌ఎ) గత ఆదివారం తెలిపింది. తాజాగా గురువారం అతడ్ని భారత సైన్యానికి అప్పగించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ట్వీట్ చేశారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతర ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పిఎల్‌ఎతో ఈ కేసును నిరంతరం సంప్రదింపులు జరిపి ఆ యువకుడ్ని క్షేమంగా విడుదల చేయించినందుకు భారత ఆర్మీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌నుంచి రక్షణ కోసం పిపిఇ కిట్ ధరించి ఉన్న యువకుడితో ఆర్మీ జవాన్లు ఉన్న ఫొటోను కూడా మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వచ దమాయ్ ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరోమ్ తరన్‌ను గురువారం భారత సైన్యానికి పిఎల్‌ఎ అప్పగించినట్లు అరుణాచల్‌ప్రదేశ్ ఎంపి కూడా అయిన కిరెన్ రిజిజు తెలిపారు. అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనా పీపుల్స్ లిబరేషన్ బలగాలు అపహరించినట్లు అరుణాచల్ తూర్పు ఎంపి తాపిర్ గావ్ తొలుత వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News