Friday, December 27, 2024

యూఎస్ సైనిక సమాచారాన్ని బీజింగ్‌కు తరలించిన చైనా బెలూన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా గగనతలంపై విహరించిన చైనీస్ స్పై బెలూన్ శ్వేతదేశం సున్నిత సైనిక సమాచారాన్ని చేరవేసిందని మీడియా నివేదిక సోమవారం తెలిపింది. బైడెన్ అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు చైనీస్ గూఢచారి బెలూన్‌ను అడ్డుకోలేకపోయాని నివేదిక వెల్లడించింది. సైనిక సమాచారాన్ని సేకరించిన వెంటనే స్పై బెలూన్ బీజింగ్‌కు సమాచారాన్ని ప్రసారం చేయగలిగిందని నివేదికలో పేర్కొన్నారు. కాగా చైనీ గూఢచారి బెలూన్ ఈ ఏడాది జనవరిలో యూఎస్ గగనతలంపై ఎగిరి అమెరికా సైనిక బలగాలపై నిఘా కార్యక్రమాలు చేపట్టింది.

మూడు బస్సుల పరిమాణంలో ఉన్న చైనా నిఘా బెలూన్ సేకరించిన సమాచారాన్ని బీజింగ్‌కు అదేకాలంలో ప్రసారం చేసిందని న్యూస్ నివేదించింది. ముగ్గురు గుర్తు తెలియని అధికారులు తెలిపినట్లు నివేదికలో పేర్కొంది. చైనా సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సిగ్నల్స్ నుంచి నివేదికలో పేర్కొన్నారు. ఆయుధ వ్యవస్థలు, బేస్ సిబ్బంది కమ్యూనికేషన్స్ నుంచి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాగా బైడెన్ అధికార యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం చైనా స్పై బెలూన్ తొలిసారి జనవరి అలస్కా నుంచి అమెరికా గగతనతలంలోకి ప్రవేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News