Monday, December 23, 2024

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

China-Covid

బీజింగ్: చైనాలో గురువారం వరుసగా మూడో రోజున కూడా 1000కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మధ్య చైనాలోని వూహాన్ నగరం నుంచి వాయవ్యంలోని షినింగ్ నగరం వరకు కొవిడ్ ఆంక్షలను రెట్టింపు చేశారు. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు దిగులుగా ఉన్నారు. చైనాలో కరోనావైరస్ కేసులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడ ఫుల్ లాక్‌డౌన్ పెట్టారు. దేశవ్యాప్తంగా అనేక ఆంక్షలు విధించారు. ఈ ఏడాది ఒమిక్రాన్ వేరియంట్ చైనాపై తీవ్ర ప్రభావమే చూపింది. ప్రపంచంలో రెండో అతి పెడ్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మార్కెట్లను కూడా దెబ్బతీసింది. చైనాలోని ఝెంగ్‌ఝూ, డాటాంగ్, షిన్ నగరాలలో కొత్త ఆంక్షలు పెట్టారు. బీజింగ్‌లోని యూనివర్సల్ రిసార్ట్ థీమ్ పార్క్‌ను బుధవారం మూసేశారు. కొవిడ్-19 విషయంలో జీరో టాలరెన్స్ విధానానికి చైనా కట్టుబడి ఉంది. వైరస్‌ను కట్టడి చేయడానికి ఇది తప్పనిసరి అని అక్కడి అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News