Monday, December 23, 2024

ఉద్యోగులకు కోట్లలో బోనస్ చెల్లించిన కంపెనీ

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాము సంపాదించే లాభాల్లో వాటాగా బోనస్ ఇస్తుంటాయి చాలా కంపెనీలు. అయితే ఆ బోనస్ డబ్బు ఆ ఉద్యోగి ఒకనెల జీతం ఉండొచ్చు.. కాకపోతే రెండు నెలలు ఉండొచ్చు.. కాని చైనాకు చెందిన ఒక కంపెనీ తమ ఉద్యోగులకు కోట్లలో బోనస్ చెల్లించిందంటే నమ్ముతారా..కాని నమ్మక తప్పదు. చైనాలో క్రేన్లు తయారు చేసే ఒక కంపెనీకి గత ఏడాది విపరీతంగా లాభాలు వచ్చాయట. ఈ సంర్భంగా తమ సంస్థ ఉద్యోగులతో కలసి ఆ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ కంపెనీ జనవరి 17న ఒక పార్టీ ఏర్పాటు చేసింది.

ఆ పార్టీలో రెండు మీటర్ల ఎత్తులో కరెన్సీ నోట్లను పేర్చింది. ఇది ఎందుకో ఉద్యోగులకు అర్థం కాలేదు. ఆ నోట్లు మొత్తం చైనా కరెన్సీ యుఎన్‌లో 61 మిలియన్లట(భారతీయ కరెన్సీ విలువ రూ.73 కోట్ల 78 లక్షలు). ఇందులో ఐదు మిలియ్ల యుఎన్‌ల(రూ. 6 కోట్లు) చొప్పున ముగ్గురు ఉద్యోగులకు బోనస్ ఇచ్చారట. మిగిలిన డబ్బును ఇతర ఉద్యోగులకు బహుమతిగా పంచిపెట్టారట. అలాంటి పెద్ద మనసున్న కంపెనీ మన దేశంలోనూ ఉంటే ఎంత బాగుంటుందో కదా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News