చిత్తూరు: చైనాకు చెందిన డిఎఒ ఇవిటెక్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి ఎలెక్ట్రిక్ ద్విచక్రవాహనాల కంపెనీ తెరవడానికి గ్రౌండ్‌వర్క్ పూర్తిచేసుకుంది. చిత్తూరులో కంపెనీ తన ప్లాంట్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. చిత్తూరు నుంచే ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ల ఎగుమతి అమెరికాకు, యూరొప్ దేశాలకు జరగనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఎలెక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నది చైనాయే. ఫ్రాస్ట్ అండ్ సుల్లివన్ కథనం ప్రకారం చైనా 2020లో 33.9 మిలియన్ ఎలెక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తిచేసింది. ప్రపంచ ఎలెక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో చైనా వాటి 97 శాతంగా ఉంది. “మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నాము. చిత్తూరులో మెగా ప్రాజెక్ట్ ఆరంభించడానికి ప్రాజెక్టు రిపోర్టును కూడా ఇచ్చాము” అని డిఎఒ ఇవిటెక్ వ్యూహాత్మక అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షుడు మనీశ్ సింగ్ తెలిపారు. అమెరికా దిగుమతి సుంకం ముప్పును తప్పించుకోడానికి మే ము మా కంపెనీని చైనా నుంచి భారత్‌కు మార్చాలనుకుంటున్నాము అని కూడా ఆయన తెలిపారు. భారత్‌లో తన ఉత్పత్తిని 2022 జనవరి నాటికి ఆ కంపెనీ ఆవిష్కరించనున్నట్లు కూడా సమాచారం.
డిఎఒ ఇవిటెక్ మోడల్ 703 ఇ-స్కూటర్‌ను ఆవిష్కరించబోతున్నది. ఇది 100 కిమీ. మైలేజి, గంటకు 70 కిమీ వేగంతో వెళ్లగలుగుతుంది. సబ్సిడీల అనంతరం దీని ధర రూ. 86000 వరకు ఉండ నుంది. అయితే ఈ కంపెనీ నాలుగు మోడల్స్‌ను ఆవిష్కరించబోతున్నది. ఈ కంపెనీ పుణెలోని చకన్, తెలంగాణలోని జహీరాబాద్‌లో రెండు లీజు లొకేషన్లను కలిగి ఉంది.