Monday, December 23, 2024

గాల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలు

- Advertisement -
- Advertisement -

Chinese Flag Unfurled In Galwan Valley

న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న గాల్వాన్ లోయలో ఇంచు స్థలం పోనివ్వం’ అని రాసున్న అక్షరాల కింద పీపుల్స్ ఆఫ్ లిబరేషన్ ఆర్మీ సైనికులు జనవరి 1, 2022న చైనా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు’ అని ట్విటర్‌లో సంబంధిత వీడియోను షేర్ చేశారు. ఇక గాల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మరో వీడియోను షేర్ చేస్తూ ‘2022 నూతన సంవత్సరం సందర్భంగా గాల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

గాల్వాన్ లోయలో ఎగురవేసిన ఈ జాతీయ జెండా చాలా ప్రత్యేకమైంది. ఈ జెండాను బీజింగ్‌లోని తియనాన్మేన్ స్వేర్‌లో ఎగురవేశారు’ అని రాసుకొచ్చారు. ఈ విషయమై ఏఐసిసి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. కొద్ది రోజుల క్రితమే 1971లో భారత్ సాధించిన విజయంపై సంబరాలు చేసుకున్నామని, దేశ భద్రత, విజయం కోసం బలమైన, వ్యూహాత్మకమైన నిర్ణయాలు అవసరం అన్నారు. కేవలం మాటలు గెలిపించలేవని, గాల్వాన్‌లో మన జాతీయ జెండా కూడా ఎగురవేసి చైనాకు గట్టి సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని రాహుల్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News