Monday, December 23, 2024

చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్‌ వీడియో వైరల్..

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిచరిత్ర సృష్టించిన చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో 18 ఏళ్ల యాకిన్ జిమ్నాస్టిక్స్ విభాగంలో రజతం సాధించింది. ఆ సమయంలో పోడియంపై నిల్చోని అమాయకంగా పతకాన్ని ముద్దాడింది.

ఆ దృశ్యాలు అప్పట్లో నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా యాకిన్‌కు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. స్వదేశం చేరుకున్న యాకిన్ రోజువారీ పనుల్లో బీజీగా మారింది. ఈ సందర్భంగా తాను పని చేస్తున్న రెస్టరెంట్‌లో భోజనం వడ్డిస్తూ కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News