- Advertisement -
బీజింగ్ : హాంకాంగ్ రాజ్యాంగ ఎన్నికల చట్టానికి చైనా శాసన సభ తీసుకొచ్చిన సవరణలు మంగళవారం ఆమోదం పొందాయి.
దీనివల్ల హాంకాంగ్ శాసన సభ నిర్మాణంపై చైనాకు ఎక్కువ నియంత్రణ అధికారం కలుగుతుంది. రెండు రోజుల పాటు జరిగిన శాసన సభ సమావేశాల్లో ఆఖరి రోజున చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్థాయి సంఘం సవరణలను ఆమోదిస్తూ తీర్మానించింది. అయితే ఆ సవరణల వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. బ్రిటిష్ వలస ప్రభుత్వం నుంచి చైనా పాలన 1997 లో అమలు లోకి వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగ చట్టం కొనసాగుతోంది. ఇప్పటి సవరణల ప్రకారం కమిటీ హాంకాంగ్ నేతను ఎంపిక చేస్తుందని, ఆ నేత శాసన సభ లోని ఎక్కువ భాగం పాలక వర్గాన్ని ఎంపిక చేసే అధికారం ఉంటుందని చైనా అధికార వర్గాలు వివరించాయి.
- Advertisement -