- Advertisement -
మాలే : మాల్దీవుల జల్లాలోకి తిరిగి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానపు పరిశోధనల నౌక వచ్చి చేరింది. 4500 టన్నుల బరువైన ఈ సముద్ర పరిశోధన నౌక ప్రవేశం సరిగ్గా దేశాధ్యక్షులుగా మెహ్మద్ ముయిజ్జు రెండోసారి మరింత బలీయ స్థితిలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జరిగింది. ఈ దీవుల సముదాయపు దేశపు వివిధ రేవులలో నిలుస్తూ వచ్చిన రెండు నెలలకు ఇప్పుడు ఈ చైనా నౌక సముద్ర జలాల్లోకి చేరుకుంది.
గురువారం ఉదయం చైనాకు చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 03 భారీ నౌక మాల్దీవులకు చెందిన తిలఫుషి పారిశ్రామిక దీవుల నౌకాశ్రయానికి చేరుకుందని న్యూస్‌పోర్టల్ అధాధూ డాట్‌కామ్‌లో తెలిపారు. చిరకాలంగా భారత వ్యతిరేకత చాటుకుంటున్న ముయిజ్జు పార్టీ ఈసారి మరింత బలంగా అధికారంలోకి రావడంతో ఈ పార్టీ ప్రభుత్వం ఇక తన చైనా అనుకూల వాదాన్ని మరింతగా చాటుకుంటుందని ఈ నౌక రాకతో స్పష్టం అయింది.
- Advertisement -