Monday, December 23, 2024

ఫిలిప్పీన్స్ నౌకపై చైనా మిలిటరీ గ్రేడ్ లేజర్ దాడి

- Advertisement -
- Advertisement -

మనీలా : దక్షిణ చైనా జలాల్లో తమ నౌకపై మిలిటరీ గ్రేడ్ లేజర్‌తో చైనా నౌక దాడి చేసినట్టు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు ఆరోపించింది. ఇది మనీలా సార్వభౌమ హక్కులను చైనా ఉల్లంఘించడమేనని ధ్వజమెత్తింది. తమ నౌకకు దాదాపు 137 మీటర్ల దూరం వరకు వచ్చి ప్రమాదకర రీతిలో చైనా కోస్టు గార్డు నౌక వ్యవహరించినట్టు ఫిలిప్పీన్స్ ఆరోపించింది.

లేజర్ బీమ్‌తో నౌకలో ఉన్న సిబ్బందిపై దాడి చేసిన విజువల్స్‌ను కూడా ఫిలిప్పీన్స్ కోస్టు గార్డు తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. గ్రీన్ కలర్ లేజర్ బీమ్‌ను చైనా వాడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 న రెండో థామస్ షోల్ వద్ద ఈ సంఘటన జరిగింది. వివాదాస్పద జలాల్లో ఫిలిప్పైన్స్ కోస్ట్‌గార్డు షిప్‌ను చైనా ఇదివరకు అడ్డుకున్న సంఘటన జరిగినప్పటికీ, లేజర్‌ను ఉపయోగించడం ఇది మొదటిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News