Saturday, December 21, 2024

భారతీయ, ఆసియాన్ యుద్ధనౌకల చేరువకు చైనా మిలీషియా బోట్లు?

- Advertisement -
- Advertisement -

మనీలా: దక్షిణ చైనా సముద్రంలో కవాతు చేస్తున్న భారత్, ఆసియాన్ దేశాల యుద్ధనౌకలున్న ప్రాంతానికి చైనా మిలీషియా నౌకలు చేరుకున్నాయని సోమవారం భారత వర్గాలు తెలిపాయి. నావికా విన్యాసాన్ని భయపెట్టడానికి, అంతరాయం కలిగించడానికి చైనా మిలీషియాను ఉపయోగిస్తున్నట్లు వియత్నాంకు చెందిన ఓ స్వతంత్ర నిపుణుడు తెలిపారు.

ఆరోపిత ఘటన గురించి, దాని సంభావ్య ఉద్దేశాల గురించి రాయిటర్స్ వేసిన ప్రశ్నలకు బీజింగ్ స్పందించలేదు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి భారత, వియత్నాం ప్రభుత్వాలు కూడా నిరాకరించాయి. రెండు రోజుల ఏషియాన్ ఇండియా మేరీటైమ్ ఎక్సర్‌సైజ్(ఎఐఎంఈ 2023) ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భారత్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రూనై దేశాల నౌకాదళ నౌకలు, విమానాలు పాల్గొన్నాయి. టూడే సీ ఫేజ్‌లో విన్యాసాలు చేశాయి.

చైనా పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 10 ఓ సందర్భంలో వియత్నామీస్ యుద్ధ నౌకకు 10 మైళ్లు దగ్గరగా వచ్చిందని ది సౌత్ చైనా సీ క్రానికల్ ఇనిషియేటివ్(ఎస్‌సిఎస్‌సిఐ) మేనేజర్ వాన్ ఫామ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా కొన్ని సంవత్సరాలుగా సార్వభౌమాధికారాన్ని కోరుకుంటోంది. ఇది ఈ ప్రాంతంలోని ఇతర సైనికులకు సున్నితమైనది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News