Monday, January 20, 2025

చంద్రుడి చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చంద్రుడిలోని చీకటి భాగంలోకి చైనా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి లాంగ్‌మార్చ్ 8 రాకెట్‌పై క్యూకియావ్ 2 అనే 1.2 టన్నుల శాటిలైట్‌ను హైపాను ప్రావిన్స్ నుంచి బుధవారం ఉదయం ప్రయోగించింది. భవిష్యత్తులో చైనా చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమి పైకి పంపేందుకు దీనిని వాడనున్నారు. సాధారణంగా చంద్రుడిపై మనకు కనిపించే భాగం నుంచి భూమిపైకి డేటా పంపడం సులువు.

కానీ అవతలి భాగం నుంచి కమ్యూనికేషన్లను నెలకొల్పడం అసాధ్యం. తాజాగా ప్రయోగించిన క్యూకియాన్ 2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో ప్రయోగించనున్న ఛాంగి 6 మిషన్ నుంచి సంకేతాలను భూమి పైకి ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఛాంగి ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలివైపు ఉన్న మట్టి ఇతర ఖనిజాలను చైనా సేకరించనుంది.

2026లో ప్రయోగించాలనే లక్షంతో పెట్టుకున్న చాంగి 7, 2028 లోని ఛాంగి 8 కు కూడా ఈ ఉపగ్రహం సహకరించనుంది. అంతేకాదు చంద్రుడి పైకి తలపెట్టిన మానవ యాత్రలకు, ఇతర గ్రహాలపై కార్యకలాపాల నిర్వహణ లోనూ , కమ్యూనికేషన్స్‌ను చైనా దీని నుంచే జరపనుంది. క్యూకియాన్ జీవిత కాలం 8 సంవత్సరాలు. తాజా ప్రయోగం లోనే టియాండు 1,2 అనే మినీ ఉపగ్రహాలను కూడా పంపింది. ఇవి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సమూహం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను వీటి ద్వారా పరీక్షించనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం లో నిర్మించ తలపెట్టిన పరిశోధన శాలకు ఇవి నేవిగేషన్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ సేవలు అందిస్తాయి,.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News