Friday, November 22, 2024

గబ్బిలాల్లో మరిన్ని కరోనా వైరస్‌లు

- Advertisement -
- Advertisement -

Chinese scientists find new batch of coronaviruses

చైనా పరిశోధకుల వెల్లడి

బీజింగ్ : ఏడాదిన్నర కిందట నుంచీ అందర్నీ ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ మూలాలు ఎక్కడ అని ఇంకా ఇదమిద్దంగా తేలని పరిస్థితుల్లో ఇలాంటి కరోనా వైరస్‌లే మరెన్నో గబ్బిలాల్లో ఉన్నట్టు చైనా పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కొవిడ్ 19కు దగ్గరగా ఉన్న రైనోలోఫస్ పుసిల్లస్ అనే వైరస్ కూడా ఇందులో ఉందని పరిశోధనల్లో తేలింది. షాండోంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం సెల్ అనే జర్నల్‌లో వెలువడింది. ఈ పరిశోధనలు చైనా లోని ఓ చిన్న ప్రావిన్స్ అయిన యునాన్‌కు పరిమితమైంది. మరి మిగతా ప్రాంతాల్లోని గబ్బిలాల్లో ఏ స్థాయిలో ఈ కొత్త కరోనా వైరస్‌లు ఉంటాయో అర్ధం చేసుకోవలసిందే. ఈ గబ్బిలాలు మనుషులతోపాటు పందులు, ఎలుకలు, పశువులు, పిల్లులు, కుక్కలు, కోళ్లుకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు.

యునాన్ లోని ఉష్ణ మండల ఉద్యానవనాలు (ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్) దాని పరిసరాల్లో అడవుల్లో నివసించే గబ్బిలాల నుంచి 2019 మే నుంచి 2020 నవంబరు మధ్య కాలంలో నమూనాలను పరిశోధకులు సేకరించారు. గబ్బిలాల రెట్టల నమూనాలు 283, నోటి నమూనాలు 109, మూత్ర నమూనాలు 19 సేకరించి అధ్యయనం సాగించారు. వివిధ గబ్బిలాల జాతుల నుంచి మొత్తం 24 కొత్త కరోనా వైరస్ జీనోమ్‌లను గుర్తించినట్టు చెప్పారు. ఇందులోని ఒకటి మాత్రం ప్రస్తుత కరోనా వైరనస్‌కు చాలా దగ్గరగా ఉన్నట్టు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్ లో చిన్న మార్పులు తప్ప మిగతాదంతా ఇప్పటి సార్స్ కొవ్ 2 లాగే ఉందని వివరించారు. థాయ్‌లాండ్‌లో గత ఏడాది జూన్‌లో గబ్బిలాల్లో ఇలాంటి వైరస్‌లు భారీగా వ్యాపిస్తున్నాయని గుర్తించినట్టు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News