Saturday, December 28, 2024

టార్చ్ బేరర్‌గా గల్వాన్ మారణకాండ సైనికుడా?

- Advertisement -
- Advertisement -
Chinese Soldier Who Fought In Galwan Is Torchbearer
వింటర్ ఒలింపిక్స్‌లో చైనా రాజకీయం
సిగ్గుచేటని మండిపడిన అమెరికా
ఒలింపిక్స్ కార్యక్రమాల్లో భారత అధికారులెవరూ పాల్గొనరు
ప్రకటించిన విదేశాంగ శాఖ ప్రతినిధి
గల్వాన్ ఘటనలో చైనా వైపు ప్రాణనష్టం ఎక్కువే
వెల్లడించిన ఆస్ట్రేలియా పత్రిక

న్యూఢిల్లీ: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గాగల్వాన్ లోయ ఘటనలో గాయపడిన ఆర్మీ అధికారిని ఎంపిక చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. చైనా నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబడుతూ ఈ చర్య సిగ్గుచేటని దుయ్యబట్టింది.2020 జూన్‌లో భారతచైనా సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈఘటనలో ఇరువర్గాలకు ప్రాణనష్టం సంభవించింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి కి ్వఫాబావోను .. వింటర్ ఒలింపిక్స్ టార్చ్న్ నిమిత్తం చైనా టార్చ్ బేరర్‌గా నియమించిందని ప్రభుత్వ అనుకూల పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ప్రకటించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్‌జియాంగ్ మిలిటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వి ఫాబావో..బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్‌మింగ్‌తో కలిసి ఒలింపిక్స్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

బుధవారం వింటర్ ఒలింపిక్స్ రన్‌లో క్రీడా ప్రముఖులు, కొవిడ్ హీరోలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు.. ఇలా 130 మందికి పైగా పాలొన్నారు. వారిలో ఫాబావో ఒకరు. కాగా ఈ చర్య బీజింగ్ క్రీడలను రాజకీయం చేస్తోందనడానికి స్పష్టమైన ఆధారమని రాజకీయ నిపుణులు అంటున్నారు.తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా సైతం స్పందించింది. ‘2020లో భారత్‌పై దాడి చేసిన వీగర్లపై మారణ హోమానికి పాల్పడుతోన్న సైనిక కమాండర్‌ను బీజింగ్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం సిగ్గుచేటు. వీగర్ల స్వేచ్ఛ కోసం, భారత సార్వభౌమాధికారానికి అమెరికా మద్దతు కొనసాగిస్తుంది’ అని యుఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఒకరు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా గల్వాన్ లోయ ఘటనలో భారత్ దాదాపు 20 మంది సైనికులను కోల్పోయింది. చైనా మాత్రం ఇంతవరకు వాస్తవ సంఖ్య వెల్లడించలేదు. కాగా ఈ సంఘటన జరిగి ఏడాదిన్నర దాటినా చైనా మాత్రం ఈ ఘర్షణల్లో తమదే పైచేయి అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండడం విశేషం.

చైనా చర్య విచారకరం: విదేశాంగ శాఖ

కాగా గల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న కమాండర్ క్విఫాబావోను వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా నియమించడానికి భారత ప్రభుత్వం కూడా ఖండించింది. చైనా చర్యను విచారకరమైనదిగా విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అభివర్ణించారు. దీనికి నిరసనగా బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం చార్జ్ డి అఫైర్స్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో కానీ, ముగింపు కార్యక్రమంలో కానీ పాల్గొనబోరనఙ ఆయన స్పష్టం చేశారు.

నష్టం ఎక్కువే: ఆస్ట్రేలియా పత్రిక

భారత సైన్యంతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ( పిఎల్‌ఎ) జవాన్లు చనిపోయినా పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే చనిపోయారని తక్కువ చేసి చెప్పుకుంది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్‌క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా, తాజాగా ఆస్ట్రేలియా పత్రిక ఒకటి ఏడాది విచారణ అనంతరం ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరదప్రవాహంలో పడి చాలామంది సైనికులు కొట్టుకుపోయి ఉంటారని, కానీ చైనా ఆ విషయాన్ని దాస్తోందని ‘క్లాక్సాన్ ’ అనే వార్తాపత్రిక వెల్లడించింది. ఈ మేరకు చైనానుంచే పలు ఆధారాలు సేకరించినట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News