Monday, December 23, 2024

జై శ్రీరామ్ అంటూ నినదించిన చైనా సైనికులు!

- Advertisement -
- Advertisement -

సరిహద్దుల్లో ఉప్పు నిప్పూలా ఉన్న భారత్, చైనా సైనికులు ఒక చోట కలసికట్టుగా ‘జై శ్రీరామ్’ అంటూ నినదించిన ఓ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘జై శ్రీరామ్’ అంటూ ఎలా అనాలో చైనా సైనికులకు భారత సైనికులు నేర్పించి, తర్వాత అందరూ కలసి జై శ్రీరామ్ అంటూ నినదించారు.

ఓ భారత సైనికుడు ఎక్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోను ఎప్పుడు తీశారో స్పష్టంగా తెలియనప్పటికీ, అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజునే ఈ సంఘటన చోటు చేసుకుని ఉండవచ్చునని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News