Monday, November 18, 2024

చైనా యూనివర్శిటీ విద్యార్థులకు వినతి!

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాలో జననాల రేటు బాగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ‘స్పెర్మ్ బ్యాంకులు’ వీర్యం దానం చేయమని యూనివర్శిటీ విద్యార్థులను కోరుతున్నాయి. ఇప్పుడీ టాపిక్ చైనాలో ట్విట్టర్ వంటి ‘వీబో’లో చర్చనీయాంశంగా మారింది. ఆగ్నేయ చైనాలోని యున్నాన్ హూమ్యన్ స్పెర్మ్ బ్యాంక్ ఫిబ్రవరి 2న తొలుత యూనివర్శిటీ విద్యార్థులను వీర్య దానం చేయమని కోరింది. తర్వాత చైనాలోని షాంగ్జీ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రకటనలే వెలువడ్డాయి. ఆరు దశాబ్దాల కాలంలో మొదటిసారి చైనాలో జననాల రేటు పడిపోయింది. చైనాలోని వేర్వేరు స్పెర్మ్ బ్యాంకులు వేర్వేరు ప్రకటనలు ఇస్తున్నాయి. ఉదాహరణకు యున్నాన్ స్పెర్మ్ బ్యాంక్ వీర్యాన్ని దానం చేసేవారు 20 నుంచి 40 ఏళ్ల వయస్సులోని వారై ఉండాలని, 165 సెమీ. కన్నా ఎక్కువ ఎత్తు ఉండాలని, ఎలాంటి వ్యాధులు లేక జన్యు వ్యాధులు ఉండరాదని, డిగ్రీ చేసిన, చేస్తున్న వారై ఉండాలని నియమాలు పెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News