Monday, December 23, 2024

‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా గూఢచారి నౌక

- Advertisement -
- Advertisement -

మాల్దీవుల దిశగా పయనం
భారత్‌లో ఆందోళన

న్యూఢిల్లీ : ఒక ‘పరిశోధన’ నౌక ముసుగులో చైనా నుంచి ఒక గూఢచారి నౌక మాల్దీవుల దిశగా సాగుతోంది. పర్యవసానంగా న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఆందోళన పరుస్తోంది. మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేసిన తరువాత ఈ నెలలో మాలెతో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో చైనా నౌక ఉనికి కలవరపరుస్తోంది. జావా, సుమత్రా మధ్య సుంద జలసంధి మీదుగా సాగి ఇండొనేషియా తీరం మీదుగా చైనా నౌక సాగుతోందని, అది ఫిబ్రవరి 8న మాలె చేరుకోవలసి ఉందని మెరైన్ ట్రాకర్ యాప్ వివరించింది.

భూభౌతిక నిపుణుడు డామియన్ సైమన్ అభిప్రాయం ప్రకారం, ఆ నౌక 2019, 2020 సంవత్సరాలలో ఆ జలాలను సర్వే చేసింది. బీజింగ్‌లో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆనందపూర్వక సమావేశం జరిగిన రోజుల తరువాత హిందూ మహా సముద్రం (ఐఒఆర్) ప్రాంతంలోఆ నౌక ఉనికి చైనాకు ఎంత ముఖ్యమైనదో చెప్పక చెబుతోంది. ‘భారత్ నిష్క్రమించాలి’ అనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికైన ముయిజ్జు మార్చి 15 కల్లా భారత్ తన సైనిక బలగాన్ని ఉపసంహరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాల్దీవులలో సుమారు 100 మంది భారత సైనికులు, సైనిక ఆస్తులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News