Wednesday, January 22, 2025

ఫిలిప్పీన్స్ నేవీపై చైనా దళాలు గొడ్డళ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. ఈ సంఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు, సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం , ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా, చైనా దళాలు దాడి చేసినట్టు వెల్లడించారు. బీజింగ్ దళాలు మొదట ఫిలిప్పీన్స్ దళాలతో వాదనకు దిగి, తరువాత బోట్ల లోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిళ్లను కాజేశారు., అక్కడే ఉన్ననేవిగేషన్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సంఘటనలో ఫిలిప్పీన్స్ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటన వేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి. ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ సంఘటనపై స్పందించారు.

చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు. చైనా కోస్ట్‌గార్డ్ వద్ద పదునైన ఆయుధాలు ఉన్నా. తమ సైనికులు ఒట్టి చేతులతో పోరాడారని పేర్కొన్నారు. తమ ఆయుధాలు, పరికరాలు తక్షణమే తిరిగి ఇవ్వాలని , కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చైనా విదేశాంగశాఖ ఈ ఘర్షణపై స్పందిస్తూ ఫిలీప్పీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను తమ కోస్ట్‌గార్డ్ దళాలు అడ్డుకొన్నాయని , అంతేతప్ప ఆదేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కోస్ట్‌గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్ గత శనివారం అమలు లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు 30 నుంచ 60 రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి దిగినట్టు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్ వాదిస్తోంది. ఇప్పుడు వాటి పరిధిలోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకుఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్టైంది. ఇటీవలనే ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొట్టడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News