Tuesday, November 5, 2024

ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్ గార్డ్ ఓడ

- Advertisement -
- Advertisement -

దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్ నౌక ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరకు రవాణా ఓడను ఢీకొంది. సోమవారం ఉదయం స్పార్టీ ద్వీపాల వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి బాధ్యత ఫిలిప్పీన్స్ నౌకదే అంటూ బీజింగ్ ఆరోపించింది. ఫిలిప్పీన్స్ సరకు రవాణా నౌకను ఎన్నిసార్లు హెచ్చరించినా వినలేదు. అది మా ఓడ వైపు దూసుకొచ్చి ఢీకొంది. దీంతో చట్టప్రకారం మా నౌక దానిపై నియంత్రణ సాధించింది.

ఫిలిప్పీన్స్ ఓడ మా రెన్ ఎ రీఫ్ వైపు అక్రమంగా వెళుతోంది” అని ఆరోపించింది. మరోవైపు ఫిలిప్పీన్స్ మాత్రం ఈ వ్యవహారంలో చైనా నావికులు అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఇక ఆ దేశాధ్యక్షుడు ఎఫ్ మార్కోస్ మాట్లాడుతూ చైనా అమల్లోకి తెచ్చిన సరికొత్త కోస్ట్‌గార్డ్ చట్టం భయంకరమైందని పేర్కొన్నారు. ఇవి పొరుగుదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సెకండ్ థామస్ షోల్ వద్ద ఉన్న తమ గస్తీ బృందానికి ఫిలిప్పీన్స్ నౌక నిత్యావసరాలు సరఫరా చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News